ప్రతిభావంతులకు ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రోత్సాహకాలు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతులకు ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రోత్సాహకాలు

May 27 2026 10:20 AM | Updated on May 27 2026 10:20 AM

ప్రతిభావంతులకు ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రోత్సాహకాలు

విజయనగరం అర్బన్‌/బొబ్బిలి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదోతరగతి–2026 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్‌ఆర్‌ షాపింగ్‌ పాల్‌ యాజమాన్య ప్రతినిధులు మంగళవారం నగదు బహుమతులను ప్రదానం చేశారు. పాఠశాలల వారీగా మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున నగదు బహుమతులను చెక్కుల రూపంలో అందజేశారు. అలాగే, పదోతరగతిలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత షాపింగ్‌ కూపన్లు పంపిణీ చేశారు. విద్యార్థు ల తల్లిదండ్రులను కూడా దుశ్శాలువ, పుష్పగుచ్ఛాలతో సత్క రించారు. విజయనగరం, బొబ్బిలి పట్టణాల్లో జరిగిన నగదు బహు మతుల ప్రదానోత్సవంలో ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌ జోనల్‌ మేనేజర్లు సూర్య, వెంకటేశ్వర రెడ్డి, హెచ్‌ఎం సీహెచ్‌.అప్పారావు, బొబ్బిలి ఎంపీడీఓ పి.రవికుమార్‌, ఎంఈఓ గొట్టాపు వాసు, ఏఓ డీవీ అప్పారావు, ప్రిన్సిపాళ్లు జి.భార్గవీదేవి, ఎం.వేణు గోపాల్‌, డిప్యూటీ ఎంపీడీఓ ఎస్‌.చంద్రమౌళీశ్వరరా వు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement