విజయనగరం అర్బన్: స్థానిక వీటీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన మెగా క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్–2026లో 189 మందికి ఉద్యోగాలు లభించాయని ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ టీవీగిరి తెలిపారు. ఈ ఉపాధి మేళాలో 13 ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 274 మంది జాబ్‌మేళాకు హాజరుకాగా, 189 మంది వివిధ కేటగిరీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విస్తృ త స్థాయిలో ప్రచారం చేసిన మోగా క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌కు ఐదు కంపెనీలు గైర్హాజరయ్యాయి. స్టైఫండ్ బేస్డ్ ఉన్న పోస్టులకు వెళ్లేందుకు విద్యార్థులకు ఆసక్తిచూపలేదు.


