జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

జాబితా విడుదల

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

టీచర్ల సీనియారిటీ

ఈ నెల 21 నుంచి 26 వరకు అభ్యంతరాల స్వీకరణ

డీఈఓ యూ.మాణిక్యం నాయుడు

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూ.మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ జాబితా ఆధారంగానే భవిష్యత్తులో బదిలీలు, పదోన్నతులు, ఇతర పరిపాలన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు స్కూల్‌ అసిస్టెంట్స్‌, ఎస్‌జీటీలు సమానమైన సిబ్బంది వర్గాలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయులు తమ వివరాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పదోన్నతుల జోన్‌లో ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా, అందరూ తమ సీనియారిటీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు తెలిపారు. జీఓ 610 ద్వారా జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులు తమ డీఎస్‌సీ మార్కులు, ర్యాంక్‌ వివరాలను సమర్పించి సీనియారిటీ సరిచేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లేకపోతే వారిని సంబంధిత డీఎస్‌సీలో జూనియర్‌గా పరిగణించే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే నోషనల్‌ సీనియారిటీ పొందిన ఉపాధ్యాయులు తగిన ఆధారాలు సమర్పించి సీనియారిటీ తప్పులు ఉన్నట్లు గుర్తించినందున, వాటిని సరిచేసుకుని అప్‌డేట్‌ చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement