పెళ్లింటికి అందని చంద్రన్న కానుక..! | - | Sakshi
Sakshi News home page

పెళ్లింటికి అందని చంద్రన్న కానుక..!

Feb 26 2026 9:18 AM | Updated on Feb 26 2026 9:18 AM

పెళ్ల

పెళ్లింటికి అందని చంద్రన్న కానుక..!

పెళ్లింటికి అందని చంద్రన్న కానుక..! ●జామి మండలానికి చెందిన ప్రవీణ్‌ అనే వ్యక్తికి విజయనగరం పట్టణానికి చెందిన పూజిత అనే మహిళతో గతేడాది ఏప్రిల్‌లో వివాహం అయింది. బీసీ వర్గానికి చెందిన వీరికి పెళ్లిక కానుక కింద ప్రభుత్వం నుంచి రూ.50 వేలు ఆర్థిక సాయం వస్తుందని అశించారు. చంద్రబాబు ప్రభుత్వం పెళ్లికానుక పథకాన్ని అమలు చేయకపోవడంతో సాయం అందలేదు. ●గంట్యాడ మండలానికి చెందిన ఎస్సీ వర్గానికి చెందిన ఎర్నాయుడు అనే వ్యక్తికి అదే మండలానికి చెందిన లక్ష్మి అనే మహిళతో గతేడాది మేనెలలో వివాహం అయింది. వీరు కూడా పెళ్లి కానుక కింద రూ.లక్ష ఆర్థిక సాయం అందితే ఖర్చులకు పనికొస్తాయని ఆశించారు. కానుక అందకపోవడంతో అప్పుచేసి పెళ్లిఖర్చులు చేశారు. ఊరించి.. ఉసూరుమనిపిస్తూ...

అధికారంలోకి వస్తే పెళ్లికానుక ఇస్తామని చంద్రబాబు హామీ రెండేళ్లవుతున్నా ఇంతవరకు అమలు చేయని వైనం వేలాది మంది దంపతులు ఎదురుచూపు పెళ్లికానుక కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50వేలు సాయానికి ఎగనామం

పెళ్లికానుక పథకం అమల్లో లేదు..

విజయనగరం ఫోర్ట్‌:

మ్మించడం.. నమ్మిన జనాన్ని నట్టేటముంచడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. అధికారంలోకి వచ్చేందుకు 2024లో జరిగిన ఎన్నికలకు ముందు అన్నివర్గాల వారినీ హామీలతో ఊరించారు. అందరికీ మేలుచేస్తానంటూ నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక జనం కట్టబెట్టిన పదవిని దర్జాగా అనుభవిస్తూ హామీలను విస్మరించారు. వలంటీర్లకు నెలకు రూ.10వేలు అన్నారు.. వ్యవస్థనే రద్దుచేశారు. ఇంటింటికీ రేషన్‌ పంపిణీకి మంగళంపాడేశారు. 50 ఏళ్లకే పింఛన్‌, నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగభృతి, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ, రైతన్నకు వడ్డీలేని రుణాలు, ఉచిత పంటబీమాను అందని ద్రాక్షగా మార్చేశారు. నూతన దంపతులకు సాయం చేస్తానని ఇచ్చిన చంద్రన్న పెళ్లికానుక హామీని సైతం సుమారు 20 నెలలుగా అమలుచేయకుండా మోసం చేస్తున్నారు. ప్రస్తుతం మంచి ముహూర్తాలవేళ ప్రభుత్వ సాయం అందకపోవడం ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఆవేదన నింపుతోంది.

ఆడ పిల్లలకు పెళ్లి చేయడమంటే తల్లిదండ్రులకు ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సాయం ఆశించడం సహజం. ఎంతో కొంత ఆర్థిక ఉపశమనం కలుగుతుందని భావిస్తారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్‌ కళ్యాణమస్తు పేరిట పథకాన్ని అమలుచేశారు. వేలాది మంది పేదకుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని అందించారు. చంద్రబాబు సర్కార్‌ ఽఅధికారం చేపట్టి సుమారు రెండేళ్లు కావాస్తున్నా పెళ్లి కానుక పథకం అమలు చేయడంలేదు. ఎన్నికల సమయంలో ‘చంద్రన్న పెళ్లికానుక’ పేరిట పెళ్లికానుక అమలు చేస్తామని ప్రకటించారు. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

ప్రస్తుతం పెళ్లికానుక పథకం అమల్లో లేదు. పథ కాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలుకు చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసపాణి, పీడీ, డీఆర్‌డీఏ

పెళ్లింటికి అందని చంద్రన్న కానుక..! 1
1/1

పెళ్లింటికి అందని చంద్రన్న కానుక..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement