విజయనగరం ఆర్డీఓకు బదిలీ | - | Sakshi
Sakshi News home page

విజయనగరం ఆర్డీఓకు బదిలీ

Feb 26 2026 9:18 AM | Updated on Feb 26 2026 9:18 AM

విజయన

విజయనగరం ఆర్డీఓకు బదిలీ

విజయనగరం ఆర్డీఓకు బదిలీ ● జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశం ఎల్లారమ్మ తల్లి జాతర ఆదాయం రూ.22.04లక్షలు కనకమహాలక్ష్మి జాతర ఆదాయం రూ.28.09లక్షలు రాష్ట్రంలో 3,041 పరిశ్రమలు మూతపడ్డాయి ● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ బొబ్బిలి డీఎస్పీకి బదిలీ

విజయనగరం కలెక్టరేట్‌: విజయనగరం రెవె న్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీఓ) దాట్ల కీర్తికి ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ పరిపాల నా శాఖ (జీఏడీ)కు రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయగా కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి వెంటనే ఆమెను రిలీవ్‌ చేశారు. ఆమె స్థానంలో ఎస్సీ సొసైటీ ఈడీ వెంకటేశ్వరరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్డీఓ కీర్తి బ్యాచ్‌కు చెందిన వారికి ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలు సక్రమంగా జరగలేదని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విష యం తెలిసిందే. ఈ కేసు విచారణలో ఉండగా తేలేవరకు వారిని అప్రధాన్య (నాన్‌ ఫోకల్‌) పోస్టుల్లో ఉంచాలని న్యాయస్థానం ప్రభుత్వా న్ని కొన్ని రోజులు కిందటే ఆదేశించింది. అమ లు కాకపోవడంతో న్యాయస్థానం బుధవారం మరోసారి ఆదేశించడంతో కీలక పోస్టుల్లో వారందరినీ ప్రభుత్వం జీఏడీకి రిపోర్టు చేయా లని ఆదేశించింది.

జామి: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన జామి ఎల్లారమ్మ తల్లి జాతర ఆదాయం ఈ ఏడాది రూ.22,04,623 ఆదాయం వచ్చింది. గతేడాది కంటే ఈ ఏడాది రూ.95,203లు ఎక్కువ ఆదా యం వచ్చినట్టు ఈఓ ప్రసాదరావు తెలిపారు. ఆలయం ఆవరణలో దేవదాయశాఖ, ఎల్లార మ్మ సేవాకమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం హుండీల ఆదాయం లెక్కించారు. దర్శన టికెట్ల అమ్మకం రూపంలో రూ. 5,24,610, ప్రసాదాల విక్రయంతో రూ. 2,38,840, హుండీల నుంచి రూ.13,03,500, విరాళాల రూపంలో 87,673, కొబ్బరి చెక్కల వేలం ద్వారా రూ.50 వేలు ఆదాయం వచ్చిన ట్టు ఈఓ వెల్లడించారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ వై.వి.రమణి, సేవా కమిటీ అధ్యక్షుడు అల్లాడ ఎర్నిబాబు, వర్రి రమణ తదితరులు పాల్గొన్నారు.

చీపురుపల్లి: స్థానిక కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర హుండీల ఆదాయం రూ. 28,09,996లు వచ్చినట్టు దేవస్థానం ఈఓ ఎస్‌.నానాజీబాబు తెలిపారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర లో భాగంగా హుండీల నుంచి రూ.15,48,388 లు, 60 గ్రాముల వెండి, దర్శనం, కేశఖండన టికెట్లు, డొనేషన్లు రూపంలో రూ.12,61,608 ల ఆదాయం లభించింది. ఆదాయం లెక్కింపులో ఆలయ కమిటీ చైర్మన్‌ గవిడి నాగరాజు, సభ్యులు పాల్గొన్నారు.

రేగిడి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ బుధవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 3,041 పరిశ్రమలు మూతపడ్డాయని, దీంతో 40వేల మంది ఉపాధిని కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలారన్నారు. రాజ్యసభలో ఎంఎస్‌ఎంఈ మంత్రి ఈ ప్రకటనే చేసినట్టు వెల్లడించారు. విద్యుత్‌, పారిశ్రామిక రాయితీలు ఇచ్చి పరిశ్రమలను ఆదుకోవాలని సభలో ప్రస్తావించినట్టు ఆయన ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.

బొబ్బిలి: డీఎస్పీ జి.భవ్యారెడ్డికి బదిలీ అయింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట వ్యాప్తంగా 25 మంది పోలీస్‌ అధికారులకు బదిలీకాగా, ఆ జాబితాలో ఈమె పేరు కూడా ఉంది. డీఎస్పీ బదిలీ వెనుక రాజకీయకోణం ఉందన్న చర్చ బొబ్బిలిలో జోరుగా సాగుతోంది. ఇటీవల విద్యార్థినులను వేధించిన వారిపై కఠినంగా వ్యవహరించడమే కారణంగా తెలుస్తోంది.

విజయనగరం ఆర్డీఓకు బదిలీ 1
1/2

విజయనగరం ఆర్డీఓకు బదిలీ

విజయనగరం ఆర్డీఓకు బదిలీ 2
2/2

విజయనగరం ఆర్డీఓకు బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement