ఎల్లారమ్మ జాతరకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఎల్లారమ్మ జాతరకు సర్వం సిద్ధం

Feb 23 2026 8:51 AM | Updated on Feb 23 2026 8:51 AM

ఎల్లా

ఎల్లారమ్మ జాతరకు సర్వం సిద్ధం

ఎల్లారమ్మ జాతరకు సర్వం సిద్ధం భక్తులకు ఇబ్బందుల్లేకుండా.. జాతర ఇలా.. నీటి సరఫరా.. గట్టి పోలీసు బందోబస్తు

నేటి నుంచి మూడు రోజులు జాతర

నేడు తొలేళ్లు ఉత్సవం

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఏర్పాట్లు పూర్తి

జామి:

త్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన భక్తుల కొంగు బంగారం జామి ఎల్లారమ్మ జాత ర సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ నెల 23న సోమవారం తొలే ళ్లు, 24న మంగళవారం జాతర, 25న బుధవారం చిన్నతీర్థం నిర్వహించనున్నారు. జాతరకు దేవదా య శాఖ అధికారులు, పంచాయతీ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు తదితర అన్ని శాఖల అదికారులు ఏర్పాట్లు చేశారు. జాతరకు జిల్లా నుంచే కాక రాష్ట్రం నలుమూలలతో పాటు ఒడి శా, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సుమారు రెండున్నర లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల క్యూలైన్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం కోసం ఏర్పా ట్లు చేశారు. జామి ప్రధాన రహదారి నుంచి ఆల యం వరకు ప్రత్యేక విద్యుత్‌ అలంకరణ ఏర్పా టు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

తొలేళ్ల ఉత్సవంతో జాతర సోమవారం ప్రారంభమవుతుంది. సోమవారం రాత్రి 12.15 గంటలకు పూజారి ఇంటి వద్దనున్న గద్దె నుంచి అమ్మవారిని దించి పురవీధుల్లో ఊరేగిస్తూ జముకుల పాట, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పులివేషాలతో, నేల డ్యాన్స్‌లతో అమ్మవారిని తీసుకువెళ్తారు. గుడిలోకి సోమవారం అర్ధరాత్రి 12.30 తరువాత ప్రవేశించిన అనంతరం బాణ సంచా కాలుస్తారు. మరుసటి రోజు మంగళవారం అమ్మవారి జాతర జరుగుతుంది.

పంచాయతీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు 24 గంటలూ తాగునీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ట్యాంకర్లతో తాగునీరు వీధుల్లో సరఫరా చేపట్టారు. గ్రామంలో పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. తాగునీటి క్లోరినేషన్‌ చేపడుతున్నారు. ఇరిగేషన్‌ అధికారులు తాటిపూడి జలాశయం నుంచి గోస్తని నదిలోకి నీటికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. జామి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో జాతరలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు నిరంతరం విద్యుత్‌ సరఫరా జరిగేటట్టు చర్యలు చేపట్టారు.

తొలేళ్లు రోజు అమ్మవారి ఊరేగింపు సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 200 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డీఎస్పీ గోవిందరావు తదితర పోలీసు అధికారులు జాతర ఏర్పాట్లపై సమీక్షించారు.

ఎల్లారమ్మ జాతరకు సంబంధించి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశాం. భక్తుల దర్శనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఆలయ ప్రాంగణం వద్ద తాగునీటి సౌకర్యం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.

– ఎం.ప్రసాదరావు, ఈఓ, దేవదాయ శాఖ

ఎల్లారమ్మ జాతరకు సర్వం సిద్ధం 1
1/2

ఎల్లారమ్మ జాతరకు సర్వం సిద్ధం

ఎల్లారమ్మ జాతరకు సర్వం సిద్ధం 2
2/2

ఎల్లారమ్మ జాతరకు సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement