భోగాపురం విమానాశ్రయంపై.. రాజకీయ డ్రామాలు వద్దు
● ప్రజలకు వాస్తవాలు తెలుసు,
మభ్యపెట్టలేరు
● భోగాపురం విమానాశ్రయం ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదే
● ఎమ్మెల్సీ సురేష్‌బాబు
నెల్లిమర్ల రూరల్: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తమ ఘనతే అంటూ చంద్రబాబు ప్రభుత్వం క్రెడి ట్ చోరీకి ప్రయత్నిస్తోందని, వాస్తవాలు ప్రజలకు తెలుసని, డ్రామాలు అవసరం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు అన్నారు. మొయి ద విజయరామపురం గ్రామంలోని తన నివాసంలో మీడియాతో సోమవారం మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయంలో మొదటి విమానం ల్యాండ్ కావడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్ప ఫలితమని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల లబ్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు కొద్ది నెలల ముందు శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఎన్ని కల అనంతరం సీఎం హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భోగాపురం విమానాశ్రయంపై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి అవసరమైన అన్ని అనుమతులు తెప్పించారని తెలిపారు. భూ సేకరణకు ఎదురైన న్యాయ చిక్కులను తొలగించారన్నారు. నిర్వాసితులకు పునరావాసం కూడా కల్పించారని చెప్పారు. అన్ని అనుమతులు సిద్ధమైన అనంతరం 2023 మే 3న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. ఈ పనులను జీఎంఆర్‌కు అప్పగించడంతో శంకుస్థాపన చేసిన నాటి నుంచే శరవేగంగా సాగాయని పేర్కొన్నారు. 2026 నాటికి విమానాశ్రయం పూర్తి చేస్తామని శంకుస్థాపన సమయంలోనే వైఎస్ జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఫ్లైట్ ల్యాండింగ్ కార్యక్రమం అట్టహాసంగా చేపట్టి ప్రొటోకాల్ మరిచారని దుయ్యబట్టారు.
సాయం చేయడం సాధ్యంకాదమ్మా...
● మంత్రి సమాధానంతో విస్తుపోయిన చర్మవ్యాధిగ్రస్త బాలుడి తల్లి
విజయనగరం అర్బన్: జామి మండలం గడికొమ్ము గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు బొబ్బిలి జయవర్దన్ పుట్టినప్పటి నుంచి వింత చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. పెలుసుబారిన చర్మంతో పాటు కాళ్లు వంకర్లు తిరిగి నడవలేని స్థితికి చేరాడు. బాలుడి సంరక్షణ కోసం తల్లి జానకి ఇంటివద్దనే ఉండిపోవాల్సి వస్తోంది. తండ్రి అప్పలనాయుడు కూలిచేయ గా వచ్చిన డబ్బులే కుటుంబానికి ఆధారం. బాలుడి మందుల కోసం ప్రతినెలా రూ.4 వేలు నుంచి రూ.5 వేలు ఖర్చవుతోందని, మందుల కోసం సాయం చేయాలంటూ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను అర్థించింది. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇలాంటి వింత చర్మవ్యాధి ఉన్న వారు రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మంది ఉన్నారని, అందరికీ ఆర్థిక సాయం చేయడం ప్రభుత్వానికి సాధ్యంకాదని స్పష్టం చేశారు. దీంతో బాలుడి తల్లి నిరాశతో వెనుదిరిగింది.
భోగాపురం విమానాశ్రయంపై.. రాజకీయ డ్రామాలు వద్దు


