
వైభవంగా శ్రీరామ పునర్వసు పట్టాభిషేకం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం జరిపించారు. అనంతరం ఆలయంలోని వెండి మంటపం వద్ద సీతారాముల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. ఆస్థాన మంటపంలో ఉత్సవమూర్తుల వద్ద రామాయణంలో పట్టాభిషేక సర్గ విన్నవించి, స్వామికి పాలు, పె రుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అ భిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్ఫాలతో సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో ఈఓ వై. శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, భక్తులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు జరిపించిన అర్చకులు

వైభవంగా శ్రీరామ పునర్వసు పట్టాభిషేకం