ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి

Aug 16 2025 8:40 AM | Updated on Aug 16 2025 8:40 AM

ఆర్‌డ

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి

స్వాతంత్య్ర వేడుకల్లో వ్యవసాయ, సెర్ప్‌గ్రామీణాభివృద్ధి, విద్య, సమగ్ర శిక్ష, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వైద్యారోగ్య, గృహనిర్మాణ, విజయనగరం మున్సిపాలిటీ, పరిశ్రమలు, ముఖ్య ప్రణాళిక, సీ్త్ర శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా, తదితర శాఖలు తమ ప్రగతిని తెలియజేసేలా శకటాలు ప్రదర్శించాయి. వీటిలో గ్రామీణ నీటి సరఫరా, విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొదటి రెండు బహుమతులు గెలుచుకోగా జిల్లా పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి శాఖలు తృతీయ బహుమతిని ఉమ్మడిగా అందుకున్నాయి.

అట్టహాసంగా స్వాతంత్య్ర దినోత్సవం

ఆకట్టుకున్న శకటాలు, విద్యార్థుల

సాంస్కృతిక ప్రదర్శనలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన

మంత్రి శ్రీనివాస్‌

జాతీయ జెండాకు గౌరవ

వందనం చేస్తున్న మంత్రి

కొండపల్లి శ్రీనివాస్‌, కలెక్టర్‌ అంబేడ్కర్‌, ఎస్పీ వకుల్‌

జిందల్‌, జేసీ సేతుమాధవన్‌

జాతీయ జెండా రంగుల్లో నీటిని ఫైర్‌ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

విజయనగరం ఫోర్ట్‌/విజయనగరం క్రైమ్‌:

విజయనగరం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయుధ దళాల పోలీస్‌ కవాతు, వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ శాఖల ప్రగతి ని సూచించే శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వేడుకల్లో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు 74 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ఎంఎస్‌ఎం పార్కులను ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 140 కోట్ల జనాభా కల్గిన భారతావని పరాయిపాలన నుంచి విముక్తి పొందిన నాటి నుంచి నేటివరకు ఎన్నో మైలు రాళ్లను అందుకుందన్నారు. ఆర్థిక, సామాజిక, సేవా రంగాల్లో విశేషమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. 2026–27 నాటికి జిల్లాలో అదనంగా 18,515 హెక్టార్లు సాగులోకి తీసుకురావాలని, ప్రకృతి సాగును 15వేల హెక్టార్లకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తల్లికివందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్‌ పథకాల లబ్ధిని వివరించారు. అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, జేసీ సేతు మాధవన్‌తో కలిసి ఉత్తమ ఉద్యోగులు, సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శనలు అలరించాయి. ఆపరేషన్‌ సిందూర్‌, నెమలి ప్రదర్శనలు ఆసక్తిగా సాగాయి. విజయనగరం, జామి కేజీబీవీలు, ఫోర్ట్‌ సిటీ స్కూల్‌, చీపురుపల్లి బాలసదన్‌, వియ్యంపేట డాక్టర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, కొత్తవలస జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు నృత్యప్రదర్శనలతో దేశభక్తిని చాటిచెప్పారు. వీరిలో జామి కేజీబీవీ బాలికల ఆపరేషన్‌ సిందూరం ప్రదర్శనకు మొదటి బహుమతి, రాజాం బాలభవన్‌ విద్యార్థుల నెమలినృత్యప్రదర్శనకు ద్వితీయ బహుమతి, వియ్యంపే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యార్థుల గిరిజన నృత్యప్రదర్శనకు తృతీయ బహుమతులు లభించాయి. పోలీస్‌ జాగిలాల విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటల ఆర్పే ప్రయోగాలు అవగాహన పెంచాయి.

ఏపీఐఐసీ శకటం

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి 
1
1/7

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి 
2
2/7

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి 
3
3/7

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి 
4
4/7

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి 
5
5/7

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి 
6
6/7

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి 
7
7/7

ఆర్‌డబ్ల్యూఎస్‌ శకటానికి ప్రథమ బహుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement