
మండల సమాఖ్యకు జాతీయ స్థాయి అవార్డు
గంట్యాడ: గంట్యాడ మండల సమాఖ్యకు జాతీయ స్థాయి ఆత్మనిర్బర్ భారత్ సంఘటన్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పూస భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి శివజార్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా సమాఖ్య అధ్యక్షురాలు కర్రి అనసూయమ్మ, కార్యదర్శి కంటిపాక సీతమ్మ, ఏపీఎంలు కోరుకొండ సులోచన దేవి, శ్రీనివాస్, ఏపీ సెర్ప్ అదనపు సీఈఓ ఆర్.శ్రీరాములునాయుడు అవార్డును అందుకున్నారు. అవార్డు కింద జ్ఞాపిక, సర్టిఫికెట్, రూ.3లక్షల చెక్కు ఇచ్చినట్టు సమాఖ్య సభ్యులు స్థానిక విలేకరులకు తెలిపారు.
పైడితల్లికి అరటిపండ్లతో అలంకరణ
విజయనగరం టౌన్: శ్రావణమాసం నాలుగో శుక్రవారం సిరుల తల్లి, ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని వనంగుడిలో అరటిపండ్లతో అలంకరించారు. ఆలయ అర్చకుడు నేతేటి ప్రశాంత్, వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేశారు. పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో జెండా పండగ
విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ వకుల్ జింద్ ముఖ్యఅతిథిగా హాజరై సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డీఎస్పీలు పి.శ్రీనివాసరావు, జి.భవ్యారెడ్డి, ఎస్.రాఘవులు, ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, పలువురు సీఐలు పాల్గొన్నారు.

మండల సమాఖ్యకు జాతీయ స్థాయి అవార్డు

మండల సమాఖ్యకు జాతీయ స్థాయి అవార్డు