
గ్రూప్–2 మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: ఏపీపీఎస్‌సీ నిర్వహించే గ్రూప్–2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన ఉచిత శిక్షణను జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులకు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ స్టడీస్ సర్కిల్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డైరెక్టర్ కె.సందీప్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ కోరుకునే అభ్యర్థుల నుంచి ఈ మేరకు దరఖాస్తులను సోమవారం నుంచి ఈ నెల 24వ తేదీలోగా స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. పరిమితమైన 60 సీట్లతో ఈ శిక్షణ తరగతులు ఈ నెల 27వ తేదీ నుంచి 50 రోజుల పాటు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టైపెండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తామని వివరించారు. అభ్యర్ధులు డిగ్రీ మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఎంపికై న ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు రెండు దరఖాస్తుతో జతజేసి స్థానిక కస్పా స్కూల్‌లో ఉన్న స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఈ నెల 24వ తేదీ లోగా అందజేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్ 9603557333, 91777726454, 8330967871 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం
కె.సందీప్‌కుమార్, డైరెక్టర్,
ఏపీ స్టడీ సర్కిల్ ఫర్ బీసీ