పెయిడ్‌ న్యూస్‌పై నిఘా | - | Sakshi
Sakshi News home page

పెయిడ్‌ న్యూస్‌పై నిఘా

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ఎన్నికల మీడియా పర్యవేక్షణను సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఎ.భార్గవతేజ, ఎన్నికల వ్యయ పరిశీలకుడు పి.వెంకట సందీప్‌రెడ్డి సూచించారు. ఆదివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రం, మీడియా రూమ్‌లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా మీడియా పర్యవేక్షణ చేపట్టాలని, రాజకీయ ప్రకటనల ధ్రువీకరణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పెయిడ్‌ న్యూస్‌, రాజకీయ ప్రకటనలు, ఇతర ప్రచార అంశాలపై నిబంధనల ప్రకారం నిఘా ఉంచాలన్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే తనకు నేరుగా తెలియజేయవచ్చని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఎ.భార్గవతేజ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement