21న అప్పన్న జమ్మివేట | - | Sakshi
Sakshi News home page

21న అప్పన్న జమ్మివేట

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

సాయత్రం శమీపూజ నిర్వహణ ముస్తాబవుతున్న స్వామివారి పూలతోట ఉత్సవంలో రామాలంకారంలో దర్శనమివ్వనున్న అప్పన్న విశేషంగా ఏర్పాట్లు

సింహాచలం : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 21వ తేదీ బుధవారం సింహాచల శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామివారి జమ్మివేట ఉత్సవం వైభవంగా జరగనుంది. కొండదిగువ పూలతోటలో నిర్వహించనున్న ఈ ఉత్సవానికి దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవం జరిగే పూలతోటను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. స్వామివారు పూజలందుకునే ప్రధాన మండపంతో పాటు శ్రీకృష్ణ కొలనుకు నూతన రంగులు వేశారు. పెద్ద ఎత్తున విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. పారిశుధ్య పనులు కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. జమ్మివేట ఉత్సవంలో భాగంగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి రామాలంకారం చేసి బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సింహగిరి నుంచి మెట్ల మార్గంలో పల్లకిపై కొండదిగువకు తీసుకువస్తారు. అనంతరం పూలతోటలోని ప్రధాన మండపంలో స్వామివారికి వేంచేపు నిర్వహిస్తారు. సాయంత్రం పూలతోటలోని శమీవృక్షం వద్ద శమీపూజ నిర్వహిస్తారు. అనంతరం శమీ దళాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరామ సర్గ పారాయణ విన్నపం అనంతరం స్వామివారిని పుష్కరిణి మండపం వద్దకు తీసుకువచ్చి అశ్వవాహనంపై అధిష్టింపజేస్తారు. అక్కడి నుంచి అడవివరం గ్రామంలో అశ్వవాహనంపై గ్రామ తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో స్వామివారిని తిరిగి సింహగిరికి తీసుకువస్తారు.జమ్మివేట ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 21న సాయంత్రం 6 గంటల వరకే సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దర్శనాలు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.అలాగే ఈనెల 21వ తేదీ సాయంత్రం ఆరాధన సేవా టికెట్లు, 22వ తేదీ ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన సేవా టిక్కెట్లు అందుబాటులో ఉండవని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement