మద్దిలపాలెం: కూచిపూడి కళాక్షేత్ర గురువు హరి రామమూర్తి శిష్యులు యోగిత, నైనాల కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమం ఆదివారం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య, కూచిపూడి కళాక్షేత్ర గురువు హరి రామమూర్తి యోగిత, నైనాలకు రంగప్రవేశ పత్రాలను అందజేశారు. అనంతరం వారిద్దరూ తమ అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా యోగిత, నైనాలకు నాట్య విశారద బిరుదులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఎస్ఎన్ రాజు, డాక్టర్ శ్రీధర్, ఎం.ఎస్. శ్రీనివాస్, కన్నం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


