దశాబ్దాల సమస్యలకు ఐదేళ్లలోనే శాశ్వత పరిష్కారం భూమి హక్కుల నుంచి మౌలిక వసతుల దాకా నూతన అధ్యాయం పర్యాటకం, పారిశ్రామిక హబ్‌గా మారిన విశాఖపట్నం
సాక్షి, విశాఖపట్నం: ఓటేసిన ప్రతిసారీ వినతులు ఇవ్వడం.. ప్రభుత్వాలు మారినా తమ రాతలు మారకపోవడం.. దశాబ్దాలుగా విశాఖవాసులకు అలవాటైపోయిన దినచర్య. అయితే 2019–2024 మధ్య కాలంలో వైఎస్సార్సీపీ హయాంలో జీవీఎంసీ పీఠాన్ని అధిరోహించిన తర్వాత విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ‘ఎవరొచ్చినా ఈ సమస్య తీరదు’ అనుకున్న ప్రతీ చోటా పరిష్కారం లభించింది. మౌలిక వసతుల కల్పన, పర్యాటకాభివృద్ధి, పారిశ్రామిక వేగంతో వైజాగ్ సరికొత్త వెలుగులు నింపుకుంది.
గాజువాక భూ సమస్యకు శాశ్వత పరిష్కారం
గాజువాక నివాసితులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన భూముల సమస్యను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా పరిష్కరించారు.
జీవో 71 అమలు: గత ప్రభుత్వాలు ఓట్ల కోసం వాడుకున్న నివాస స్థలాలకు నూతన జీవో ద్వారా నామమాత్రపు రుసుముతో పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ డీడ్లు అందజేశారు.
రూ.1,500 కోట్ల విలువైన హక్కులు: హౌసింగ్ సొసైటీ పరిధిలోని 7,026 మందికి కన్వేయన్స్ డీడ్లు అందాయి.
నిర్వాసితులకు ఊరట: స్టీల్ ప్లాంట్ నిర్వాసిత గ్రామం కర్ణవానిపాలెం వాసులకు 40 ఏళ్ల నాటి సమస్యను తీరుస్తూ లేఅవుట్ రూపకల్పన చేశారు. అలాగే 39 మంది ఉక్కు నిర్వాసితులకు, 40 మంది ఫార్మాసిటీ భూనిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
నియోజకవర్గాల వారీగా నెరవేరిన కలలు
తూర్పు నియోజకవర్గం: పదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన హనుమంతవాక నుంచి కైలాసగిరి కూడలి వరకు రోడ్డు విస్తరణ పనుల చిక్కుముడులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీడ్చేసింది.
దక్షిణ నియోజకవర్గం: దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన పాతనగరం (వన్‌టౌన్) జగదాంబ జంక్షన్ నుంచి రాణిబొమ్మ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో పాటు అన్నవరం సత్యదేవుని ఆలయ ఘాట్ రోడ్డును పూర్తి చేసింది.
ఉత్తర నియోజకవర్గం: కొండవాలు ప్రాంతాల ప్రజల రక్షణ కోసం రూ.9 కోట్లతో రక్షణ గోడల (రిటైనింగ్ వాళ్లు) నిర్మాణం చేపట్టింది.
భీమిలి నియోజకవర్గం: పాండ్రంగి వద్ద గోస్తనీ నదిపై రూ.16.50 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏళ్లనాటి కల నెరవేర్చింది.
పెట్టుబడులస్వర్గధామం విశాఖ
2023లో నిర్వహించిన ’గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్’ ద్వారా విశాఖ ముఖ చిత్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.
ప్రముఖ సంస్థల రాక: గ్రీన్ ఎనర్జీలో ఎన్టీపీసీ,
ఇంధన రంగంలో హెచ్పీసీఎల్తోపాటు ఒబెరాయ్, తాజ్, ఇన్–ఆర్బిట్ మాల్, టర్బో ఏవియేషన్ వంటి దిగ్గజాలు విశాఖకు తరలివచ్చాయి.
ఉపాధి అవకాశాలు: రూ.600 కోట్లతో 13 ఎకరాల విస్తీర్ణంలో దక్షిణాదిలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ ఏర్పాటు ద్వారా 8,000 మందికి ఉపాధి లభించింది.
ఐటీ విప్లవం: రహేజా గ్రూప్స్ ఆధ్వర్యంలో రెండో దశ కింద 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఐటీ క్యాంపస్ ద్వారా మరో 3,000 మందికి ఉద్యోగాలు అందనున్నాయి.
విశాఖలో అభివృద్ధి ఇలా..
2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల కా లంలో రూ.547.45 కోట్లతో 2089 రహదారి పనులు నిర్వహించారు.
పదిహేనేళ్లుగా రహదారి సౌకర్యానికి నోచుకోని ప్రాంతాలకు సైతం రోడ్లు వేశారు.
వీటితో పాటుగా వివిధ ఫండ్స్ కింద వచ్చిన నిధులతో 27 కి.మీ మేర రూ.104 కోట్లతో రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి చేశారు.
అన్ని నియోజకవర్గాల్లో మొత్తం రూ.462.70 లక్షలతో 20 బస్ బేలు నిర్మించారు.
పర్యాటకం.. మౌలిక వసతుల పండగ
పర్యాటకంగా వైజాగ్‌ను ప్రపంచపటంలో నిలిపేలా వైజాగ్ స్క్వేర్, సీ హారియర్ మ్యూజియం (రూ.10 కోట్లు) వంటి మల్టీ–కోటి ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చింది.
రహదారుల విప్లవం: ఐదేళ్ల కాలంలో రూ.547.45 కోట్లతో 2,089 రోడ్డు పనులు చేపట్టారు. పదిహేనేళ్లుగా దారి లేని ప్రాంతాలకు రోడ్ల వసతి కల్పించారు.
మోడరన్ జంక్షన్లు: ఇతర నిధుల నుంచి మరో రూ.104 కోట్లతో 27 కిలోమీటర్ల మేర రోడ్లు, జంక్షన్లను విస్తరించారు.
అధునాతన బస్ బేలు: ప్రయాణికుల సౌకర్యార్థం నగరవ్యాప్తంగా రూ.4.62 కోట్లతో 20 అధునాతన బస్ బేలను అందుబాటులోకి తెచ్చారు.


