క్షుద్రపూజల కలకలం.. ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

క్షుద్రపూజల కలకలం.. ఇద్దరి అరెస్ట్‌

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

ఎంవీపీకాలనీ: రాత్రివేళల్లో క్షుద్రపూజలు చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్న ఇద్దరిని ఎంవీపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంవీపీ కాలనీ సెక్టార్‌–6లోని ఏబీసీ పార్కు సమీపంలో తెడ్డు మోహన సంధ్య (42), గురు వెంకటరమణ (49) నివాసముంటున్నారు. కొంతకాలంగా వీరు రాత్రివేళల్లో వింతగా ప్రవర్తిస్తూ పూజలు చేయడంతో పాటు పెద్ద శబ్దాలు చేస్తుండటంతో స్థానికులు పలుమార్లు 112కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో వారి ఇంటిని తనిఖీ చేయగా పూజా సామగ్రి, వివిధ రకాల ముగ్గులు కనిపించాయి. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 181 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచినందుకు ఏపీ ఎకై ్సజ్‌ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 16 వరకు రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌ఐ సీతారాం తెలిపారు.

మోహన సంధ్య, వెంకటరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement