ఘనంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆవిర్భావ దినోత్సవం

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

బీచ్‌రోడ్డు: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 121వ ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖ జోన్‌ పరిధిలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం జోనల్‌ కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం కేక్‌ కటింగ్‌, సిబ్బంది సమావేశాలు జోన్‌ పరిధిలోని 87 శాఖల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్‌ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరం, వివిధ శాఖల్లో రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కస్టమర్‌ మీట్స్‌ నిర్వహించి, బ్యాంక్‌తో అనుబంధం ఉన్న ప్రముఖ ఖాతాదారులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. వేడుకల్లో భాగంగా విశాఖ మోడల్‌ స్కూల్‌ ఫర్‌ ది బ్లైండ్‌, గాజువాకకు విరాళం అందజేశారు. అనంతరం నిర్వహించిన రిటైరీల మీట్‌లో మాజీ ఉద్యోగులను సత్కరించారు. సోమవారం ఆర్‌.కే. బీచ్‌ రోడ్డులో ఉత్సాహభరితమైన మారథాన్‌ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement