తేల్చాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

తేల్చాల్సిందే..

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

డీఎస్సీ అక్రమాల నిగ్గు
లోకేశ్‌ రాజీనామా చేయాలి.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌

వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం

ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసనలు

సాక్షి,విశాఖపట్నం: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై యువత కదం తొక్కింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో భారీగా నిరసన ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు చేపట్టారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ఎల్‌ఐసీ భవనం వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్లటి దుస్తులు ధరించి నిరసన తెలియజేశారు. వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని నినదించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్‌, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, పార్టీ నాయకులు ఉరుకూటి చందు, ద్రోణంరాజు శ్రీవత్సవ్‌, అంబటి శైలేష్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌, బాణాల తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ కోటాలో 421 పోస్టుల్లో

అక్రమాలు: ఉరుకూటి చందు, శ్రీవత్సవ్‌

డీఎస్సీ–2025లో స్పోర్ట్స్‌ కోటా కింద 421 పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారని పార్టీ యువజన విభాగం నాయకులు ఉరుకూటి చందు, ద్రోణంరాజు శ్రీవత్సవ్‌ ఆరోపించారు. రాత పరీక్ష లేకుండానే నకిలీ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల ఆధారంగా ఇష్టానుసారంగా ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. కనీస అర్హతలైన డిగ్రీ, బీఎడ్‌, డీఈఎల్‌ఎడ్‌ (డైట్‌), టెట్‌ అర్హతలు లేకున్నా ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. ఇందుకోసమే కొత్త జీవోలను తీసుకొచ్చి, తర్వాత మళ్లీ వాటిలో మార్పులు చేశారని ఆరోపించారు.

అర్హతలు లేకున్నా ఉద్యోగాలు: అంబటి శైలేష్‌,

మహమ్మద్‌ ఇమ్రాన్‌

మెగా డీఎస్సీ పేరిట అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని పార్టీ యువజన విభాగం నాయకులు అంబటి శైలేష్‌, మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఆరోపించారు. డిగ్రీ–బీఎడ్‌, ఇంటర్‌–డీఈఎల్‌ఎడ్‌, టెట్‌ అర్హతలు లేకుండానే నకిలీ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు చేపట్టారని విమర్శించారు. కష్టపడి చదివిన నిరుద్యోగుల అవకాశాలను ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు.

సీబీఐ విచారణతో నిజాలు

వెలుగులోకి వస్తాయి: వరుదు కల్యాణి

డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. మీడియా ముందు ధైర్యంగా మాట్లాడే విద్యాశాఖ మంత్రి లోకేశ్‌, సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. నిరుద్యోగుల హక్కుల కోసం జరిగే ఉద్యమాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఉద్యోగాల కోసమే స్పోర్ట్స్‌ కోటా?: మళ్ల విజయప్రసాద్‌,

మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి

ఉద్యోగ నియామకాలలో ఈ తరహా స్పోర్ట్స్‌ కోటా దేశంలో ఎక్కడా లేదని పార్టీ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్‌, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగాలను అమ్ముకునేందుకే ప్రత్యేక జీవో తీసుకొచ్చారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగిందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పర్యవేక్షకులు రవిరెడ్డి, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు బాణాల తరుణ్‌కుమార్‌, సూరాడ అనుదీప్‌, కంకాల ఈశ్వరరావు, జాగుపల్లి నరేష్‌, అడారి హరీష్‌, జీరు రవికుమార్‌రెడ్డి, గుజ్జి ధీరజ్‌కుమార్‌, రేసపు శ్రీనివాసరెడ్డి, చెకూరి హరీష్‌వర్మ, గుంటు ఆనంద్‌, నక్కన రాజ్‌కమల్‌ యాదవ్‌, యలమంచిలి సంతోష్‌కుమార్‌, పాల రమణ, కాగితాల రవికిరణ్‌, తాడి రవితేజ, మువ్వల సంతోష్‌కుమార్‌, ఇల్లుపు శ్రీనివాస్‌, గార్లంక మురళి, రౌతు శ్రీను, పిలక తరుణ్‌రెడ్డి, వాక తులసీకృష్ణకుమార్‌, చెన్నా నితీష్‌, కిరణ్‌రెడ్డి, ముఖ్యనాయకులు కె.సతీష్‌, బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణికుమారి, సతీష్‌వర్మ, కొండా రాజీవ్‌గాంధీ, జహీర్‌ అహ్మద్‌, మంచా నాగమల్లేశ్వరి, పీవీ నారాయణ, తాడి జగన్నాథరెడ్డి, కోరుకొండ స్వాతిదాస్‌, పల్లా దుర్గారావు, లింగం శ్రీనివాస్‌, ప్రసాద్‌రాజు, కటారి అనిల్‌కుమార్‌, బొల్లవరపు జాన్‌ వెస్లీ, పేర్ల విజయచంద్ర, అల్లు శంకరరావు, సాడి పద్మారెడ్డి, సనపాల రవీంద్రభరత్‌, బోని శివరామకృష్ణ, పీల ప్రేమకిరణ్‌, శ్రీదేవి వర్మ, మారుతి ప్రసాద్‌, బిపిన్‌కుమార్‌ జైన్‌, కె.వి.శశికళ, లావణ్య, బర్కత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

గాంధీజీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు ప్లకార్డులతో కూడిన వినతి అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

లోకేశ్‌ రాజీనామా చేయాలి: కేకే రాజు

డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేసి, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు. డీఎస్సీ మెరిట్‌ జాబితాలో మార్పులు చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనివల్ల అర్హులైన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement