అల్లిపురం: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆర్టీసీ అధికారుల సమాచారం మేరకు టూటౌన్ సీఐ బి. అప్పల నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 48 ఏళ్లు ఉంటుందని, 5 అడుగుల ఎత్తు, చామన ఛాయ రంగు కలిగి ఉండి, కుడి చేతికి ఇత్తడి కడియం ధరించి ఉన్నాడని సీఐ తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు 94409 04716 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు.


