మహారాణిపేట: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యుమరేషన్, ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ శనివారం సమీక్షించారు. ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, సేకరించిన ఫారాలను ఆలస్యం లేకుండా డిజిటలైజ్ చేయాలని బీఎల్‌వోలు, ఎన్నికల సిబ్బందికి ఆదేశించారు. జిల్లాలోని 20,23,009 మంది ఓటర్లలో జూలై 11 సాయంత్రం 6 గంటల నాటికి 15,49,554 ఫారాలు డిజిటలైజ్ కాగా, 76.60 శాతం పురోగతి నమోదైంది. యూఈఎఫ్‌లతో కలిపి మొత్తం పురోగతి 79.52 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు. మిగిలిన ఫారాల సేకరణ, డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి, లోపాలకు తావులేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


