శతాబ్ది సంబరం.. అబద్ధాల ఆడంబరం! | - | Sakshi
Sakshi News home page

శతాబ్ది సంబరం.. అబద్ధాల ఆడంబరం!

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

జగన్‌ హయాంలో ఏయూలో జరిగిన అభివృద్ధికి ముసుగు అప్పటి ప్రగతి ఛాయలు లేకుండానే శతాబ్ది వేడుకలు ఏ–హబ్‌, ఎలిమెంట్‌, ఆల్గోరిథమ్‌, ఏయూసిబ్‌ ఊసెత్తని పాలకులు ప్రతిష్టాత్మక నాక్‌ ఏ++ ప్రస్తావన లేకుండా ఉత్సవాలు కూటమి నేతలే అతిథులు.. వారి కనుసన్నల్లోనే కార్యక్రమాలు

విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్స వాలు అబద్ధాల పునాదులపై ఆడంబరంగా సాగుతున్నాయి. వందేళ్ల అక్షర ప్రస్థానంలో సాధించిన ఘనతను మరుగున పెట్టేసి.. కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఈ వేడుకలను మార్చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏయూ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందితే.. నేడు ఆ ప్రగతి ఛాయలు కూడా కనిపించకుండా ప్రస్తుత పాలకులు ‘పచ్చ’ కుట్రలకు తెరలేపారు. విద్యార్థుల భవిష్యత్తు ను తీర్చిదిద్దిన ప్రాజెక్టులను స్మరించుకోవాల్సిన వేళ.. వాటి ఉనికినే తుడిచిపెట్టేలా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీని అభివృద్ధి చేసిన జగన్‌ పేరు వినిపించకూడదనే కుత్సిత బుద్ధితో, వర్సిటీ గౌరవాన్ని పెంచిన కీలక ప్రాజెక్టులను, అంతర్జాతీయ గుర్తింపులను పక్కనబెట్టి.. పచ్చ కండువాల కనుసన్నల్లోనే ఈ వేడుకలు సాగుతుండటంపై విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఏయూ ప్రగతిపై ‘కూటమి’ ముసుగు

దేశానికి ఎందరినో మహానుభావులను ఏయూ అందిస్తే.. ఇపుడు శతాబ్ది ఉత్సవాల వేళ వారిలో ఒక్కరిని కూడా ఏయూకు ఆహ్వానించకపోవడం గమనార్హం. ప్రతి కార్యక్రమాన్ని కూటమి నేతలు, ప్రజాప్రతినిధులే ముఖ్య అతిథులుగా కార్యక్రమాన్ని కానిచ్చేస్తున్నారు. ఈ తరుణంలో ఏయూ ప్రగతిపై కూటమి ముసుగు వేసేశారు. 2019–2024 మధ్య ఏయూ గ్లోబల్‌ స్టార్టప్‌ హబ్‌గా రూపాంతరం చెందింది. వైఎస్‌ జగన్‌ ప్రభు త్వం ఏయూ అభివృద్ధి కోసం రూ. కోట్లు వెచ్చించడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును మార్చేలా విప్లవాత్మక మౌలిక సదుపాయాలు కల్పించింది. కానీ, నేటి శతాబ్ది ఉత్సవాల్లో ఆ ప్రగతి ఛాయలు ఎక్కడా కనిపించకుండా ముసుగు వేసేశారు. వందేళ్ల వేడుక అంటే గతాన్ని గౌరవించడం, వర్తమానాన్ని చాటడం.. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం వేరు.

ఆ ఆవిష్కరణల ఊసేది?: నగరాన్ని ఐటీ, టెక్నాలజీ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఏయూలో అద్భుతమైన ఇంక్యుబేషన్‌ సెంటర్లను జగన్‌ ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్రంలోనే అతిపెద్ద స్టార్టప్‌ వేదికగా నిలిచిన ‘ఏ–హబ్‌’ ద్వారా ఎందరో యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. అలాగే ఫార్మా, పరిశోధన రంగాల్లో విప్లవం తెచ్చిన ‘ఎలిమెంట్‌’, డేటా సైన్స్‌, ఐటీ రంగాలకు ఊపిరిపోసిన ‘ఆల్గోరిథమ్‌’ వంటి భవనాలు నేడు ఏయూ ప్రతిష్టకు నిలువుటద్దాలు. రక్షణ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు వేదికైన ‘ఏయూసిబ్‌’ గురించి నేడు పాలకులు కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ ప్రాజెక్టుల పేర్లు చెబితే జగన్‌ అభివృద్ధి కనిపిస్తుందన్న భయంతో, ఉత్సవాల బ్రోచర్లలో సైతం వీటి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు.

నాక్‌ ఏ++ ప్రస్తావనపై ఉద్దేశపూర్వక మౌనం

ఏయూ చరిత్రలో అత్యున్నత ఘట్టం ఏదైనా ఉందంటే అది ‘నాక్‌’ నుంచి ఏ++ గ్రేడ్‌ అంతే అతిశయోక్తి కాదు. దేశంలోని అతి కొద్ది వర్సిటీలకు మాత్రమే దక్కే ఈ గౌరవం గత ప్రభుత్వ హయాంలో ఏయూకి దక్కింది. పరిపాలనలో పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పన, రీసెర్చ్‌ పేపర్ల పబ్లికేషన్‌ వంటి అంశాల్లో జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైంది. ఈ మైలురాయిని కూడా ప్రస్థావిస్తే ఎక్క డ గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని కూట మి నేతలు వణికిపోతున్నారు. అందుకే నాక్‌ గ్రేడింగ్‌ గురించి కానీ, వర్సిటీ సాధించిన ర్యాంకుల గురించి కానీ నోరు మెదపడం లేదు. సరస్వతీ నిలయంగా ఉండాల్సిన వర్సిటీని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ అడ్డాగా మార్చేసింది. శతాబ్ది ఉత్సవాల నిర్వహణ మొత్తం కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. క్యాంపస్‌లో విద్యార్థుల కేరింతల కంటే రాజకీయ నినాదాల హోరే ఎక్కువగా వినిపిస్తోంది. వందేళ్ల పండగను ఒక పవిత్ర కార్యంగా కాకుండా, పచ్చ పార్టీ ప్రచార వేదికగా మార్చేయడంపై పూర్వ విద్యార్థులు, మేధావులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement