వైఎస్సార్‌ సీపీలో చేరిన బీజేపీ నాయకులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో చేరిన బీజేపీ నాయకులు

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

మహారాణిపేట: బీజేపీ నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పార్టీ కండువాలువేసి ఆహ్వానించారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ క్రిస్టియన్‌ మైనార్టీ స్టేట్‌ సెక్రటరీ శ్రీరత్నం లింగంతో పాటు డా. సురేష్‌ పిట్ట, మోహన్‌ బాబు, రమణి, అరుణ తదితరులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. కూటమి విధానాలు నచ్చకే వైఎస్సార్‌ సీపీలో చేరినట్టు వీరు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపలేటి బాలరాజు, మాజీ డిప్యూటీ మేయర్‌ కట్టుమూరి సతీష్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి మంచ నాగమల్లీశ్వరి, రాష్ట్ర క్రిష్టియన్‌ మైనార్టీ విభాగం అధ్యక్షుడు జాన్‌ వెస్లీ , జిల్లా పార్టీ కోశాధికారి అనిల్‌ కుమార్‌ రాజు, పార్టీ నాయకులు ఎండి షరీఫ్‌ , జీలకర్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

కండువా కప్పి ఆహ్వానించిన కేకే రాజు

Advertisement
 
Advertisement
Advertisement