డాబాగార్డెన్స్: జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో విశాఖ జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ తొలి వారంలో రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన పర్సంటైల్ మేరకు ర్యాంకులు ఖరారు చేసి విడుదల చేశారు. వాటి ప్రకారం విశాఖలో కార్పొరేట్ కళాశాలలు శ్రీచైతన్య, నారాయణ, ఎసెంట్, శ్రీవిశ్వ, శశి, తిరుమల ఇతర విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఓపెన్ కేటగిరీలో కె.హిమకర్ (46), గోవింద్ పాండే (56), పి.భార్గవ్ నాయుడు (58), ఎం.నాగ సహస్త్ర(85), కొండల కనిష్క (113), బొడ్డి ధీరజ్ (185), వెచ్చ వెంకట సాయి లోకేష్ (323), అల్లు రోహిత్ (444), బంకూరు ప్రవీన్ (559), రెడ్డి సాయి సాహితి (572), సీరపు వెంకట వైశాలి (646), తండ్యాల పవన్ సాయి (853), తమటపు హారిక శ్రీ మోదా (897), బి.సాయి చరణ్ (921) ర్యాంకులు సాధించారు.


