హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి
సబ్బవరం: కేసుల వేగవంతమైన పరిష్కారానికి మీడియేషన్ ఒక సమర్థవంతమైన మార్గమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి పేర్కొన్నారు. దీనిని కేవలం ప్రత్యామ్నాయ విధానంగానే కాకుండా, న్యాయవ్యవస్థలో అంతర్భాగంగా చూడాలని సూచించారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఐదు రోజుల మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో వర్సిటీ వీసీ ఆచార్య డి. సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీసీ సూర్యప్రకాశరావు తదితరులు వివిధ అంశాలపై మాట్లాడారు.


