సింహగిరిపై చందనోత్సవం సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు విశేష సేవలు అందించాయి. అందులో భాగంగా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలో సుమారు 6000 మంది భక్తులకు పుచ్చకాయ ముక్కలను పంపిణీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ఎస్. పార్థసారధి, ప్రమోద్ భరద్వాజ్, పీవీవీఎస్ మూర్తిల నేతృత్వంలో జరిగింది. సుమారు 30 మంది వలంటీర్లు పాల్గొని భక్తులకు సేవలందించారు. ఈ సేవా కార్యక్రమాల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.


