బీచ్‌రోడ్డు: వీఐపీ రోడ్డులోని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కార్యాలయంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల సమయంలో కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఫైళ్లకు అంటుకున్నాయి. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక వాహనం సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టం వివరాలు సేకరిస్తున్నారు.


