నగరం నడిబొడ్డున, సాగర గాలుల సాక్షిగా తలఎత్తుకుని నిలబడిన విద్యా భాండాగారం పేరు వింటే తెలుగు వారి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అదే ఆంధ్ర విశ్వవిద్యాలయం. వందేళ్ల కిందట నిర్మితమైన ఇక్కడి చారిత్రక భవనాలు నేటికీ చెక్కుచెదరని దృఢత్వంతో, అద్భుతమైన నిర్మాణ శైలితో మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా పరిపాలన(సీఏవో) భవనం విశ్వవిద్యాలయానికే గుండెకాయ వంటిది. కాల చక్రం వేగంగా తిరిగింది. సీఏవో భవనం చుట్టూ ఉన్న పరిసరాలు నేడు అభివృద్ధి చెందాయి. భవనం తన గాంభీర్యాన్ని అలాగే కాపాడుకుంటూనే, తన చుట్టూ ఆధునికతను అలంకరించుకుంది. ఆ రాతి గోడల్లో దాగి ఉన్న విజ్ఞానం తరాలు మారుతున్నా నేటికీ దిశానిర్దేశం చేస్తూనే ఉంది. – మద్దిలపాలెం
నేడు
నాడు


