ఐదున్నరేళ్ల పోరాటం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

ఐదున్నరేళ్ల పోరాటం స్ఫూర్తిదాయకం

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

డాబాగార్డెన్స్‌: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జేఏసీ, అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వేదికగా జరుగుతున్న దీక్షకు వైఎస్సార్‌ టీయూసీ ఆదివారం సంఘీభావం తెలిపింది. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి హాజరై తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఐదున్నరేళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జోనల్‌ అధ్యక్షుడు పీవీ సురేష్‌, వైఎస్సార్‌ టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాయపూర్‌ అనీల్‌ కుమార్‌, స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు దాలినాయుడు, పేర్ల నూకరాజు, నమ్మి ప్రసాద్‌, చిత్రాడ బాలకృష్ణ, ఎన్నేటి రమణ, బొడ్డ గోవింద్‌, గొందేసి శ్రీనివాస రెడ్డి, కారి ఆనంద్‌, మహేష్‌, అప్పారావు, అప్పలరెడ్డి, నందిబాబు, వెంపడ వెంకటరమణతో పాటు కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

Advertisement
 
Advertisement
Advertisement