మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరామర్శ | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరామర్శ

Mar 1 2026 7:21 AM | Updated on Mar 1 2026 7:21 AM

మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరామర్శ

మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరామర్శ

మహారాణిపేట: మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత జోగి రమేష్‌ను ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి పరామర్శించారు. శనివారం పెడనలోని జోగి రమేష్‌ స్వగృహానికి వెళ్లిన నేతలు.. ఆయనతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటీవల జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ శ్రేణులు పెట్రోలు బాంబులతో చేసిన దాడిని, విధ్వంసాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా దాడి జరిగిన ప్రదేశాన్ని చూపించి, ఆనాటి ఘటనను జోగి రమేష్‌ వారికి వివరించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ.. బీసీ నాయకుడు, మాజీ మంత్రిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలతో దాడి చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దీన్ని రాష్ట్రంలోని బీసీలందరిపై జరిగిన దాడిగానే భావించాలన్నారు. పక్కా ప్రణాళికతోనే జోగి రమేష్‌, ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోనల్‌ ఇన్‌చార్జి అంబటి శైలేష్‌, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు జీలకర్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement