పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ? | - | Sakshi
Sakshi News home page

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?

Feb 21 2026 6:48 AM | Updated on Feb 21 2026 6:48 AM

పాలనల

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?

ఫైళ్ల నిర్వహణలో ఆంగ్లానిదే ఆధిపత్యం ఉత్తర ప్రత్యుత్తరాల్లో నామమాత్రంగానే అమ్మ భాష నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

మహారాణిపేట: దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. అమ్మ ఒడిలో ఉగ్గుపాలతో నేర్చుకునే మాతృభాష అమృతంతో సమానం. శనివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఈ సందర్భంగా మన మాతృభాష స్థాయినీ, ప్రభుత్వ కార్యాలయాల్లో దాని అమలు తీరును ఒకసారి గమనిస్తే.. పరిస్థితి నిరాశాజనకంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫైళ్ల నిర్వహణలో తెలుగు అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. పరిపాలనలో అమ్మ భాషను అక్కున చేర్చుకోవాల్సిన అధికారులు.. ఆంగ్లానికే పెద్దపీట వేస్తుండటం గమనార్హం.

అన్ని ప్రభుత్వ శాఖల్లో పాలనా వ్యవహారాలు, ఫైళ్ల నిర్వహణ మాతృభాషలోనే జరగాలన్న ఆలోచన ఉన్నా.. అది కార్యరూపం దాల్చడం లేదు. కలెక్టరేట్‌ సహా ఇతర కీలక ప్రభుత్వ శాఖల్లో తెలుగులో నడుస్తున్న ఫైళ్లు అత్యల్పం. జిల్లా వ్యాప్తంగా జరిగే ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాల్లో అత్యధిక శాతం ఆంగ్ల భాషలోనే సాగుతున్నాయి. విచిత్రమేమిటంటే.. జిల్లాలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులకు తెలుగు భాష కనీసం చదవడం కూడా రాని పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులే ఆంగ్లంలో ఆదేశాలు ఇస్తుండటంతో, కింది స్థాయి సిబ్బంది అదే బాట పడుతున్నారు.

పొరుగున పట్టింపు.. మన దగ్గర నిర్లక్ష్యం

పొరుగున ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మాతృభాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ, ఏపీలో ముఖ్యంగా విశాఖ లాంటి నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఎవరైనా అచ్చమైన తెలుగులో మాట్లాడితే వింతగా చూసే దుస్థితి నెలకొంది. మాతృభాషకు ఇతర రాష్ట్రాలు ఇస్తున్న గౌరవం మనం ఇవ్వలేకపోతున్నామన్న బాధ భాషావేత్తల్లో వ్యక్తమవుతోంది.

ఉనికికే ముప్పు..

అమ్మ భాష పట్ల చూపుతున్న ఈ నిర్లక్ష్యం రానున్న కాలంలో పెను ప్రమాదంగా మారనుందని తెలుగు భాషాభిమానులు, ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. ఒక భాషను కనీసం 30 శాతం మంది ప్రజలు దైనందిన జీవితంలో వినియోగించకపోయినా, మాట్లాడకపోయినా ఆ భాష ఉనికికే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తెలుగు భాష తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. భాష అంతరిస్తే, మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా కనుమరుగవుతాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు మేల్కొని పరిపాలనలో తెలుగును విధిగా అమలు చేసేలా పటిష్ట చర్యలు తీసుకోవాలి. భావితరాలకు మన తెలుగు భాషను, సంస్కృతిని సగర్వంగా అందించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపైనా ఉంది.

ఎరక్కపోయి.. ఇరుక్కుపోయి!

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?1
1/5

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?2
2/5

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?3
3/5

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?4
4/5

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?5
5/5

పాలనలో ‘తెలుగు’ వెలుగు ఏదీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement