బీఎస్‌ఎన్‌ఎల్ నూతన కార్యవర్గం ఎన్నిక
డాబాగార్డెన్స్: ఏఐ బీఎస్‌ఎన్‌ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.ఆర్.పట్నాయక్ నేతృత్వంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన సంఘ త్రైవార్షిక సమావేశంలో ఏపీ సర్కిల్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరుసగా రెండోసారి కార్యదర్శిగా ఎన్నికై న డబ్బీరు వెంకటేశ్వరరావు, నూతన అధ్యక్షుడు వి.విశ్వనాథం, ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. విశాఖ జిల్లా సంఘం కార్యదర్శి కె.సోమసుందరరావు, ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి రాష్ట్ర సంఘంలో ఎం.శ్రీమన్నారాయణ చీఫ్ అడ్వైజర్‌గా, వీఆర్‌కే శర్మ ఉపాధ్యక్షుడిగా, కేవీడీ స్వామి, కె. కృష్ణకుమారి సహాయ కార్యదర్శులుగా, పక్కి రమేష్, జె.అప్పారావు ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. వీరంతా పెన్షనర్ల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు.


