సభా సంప్రదాయాలు మంటగలిసిన రోజు
విశాఖ పౌరులకు నిజంగా ఇది చీకటి రోజు. నాలుగేళ్ల మేయర్‌గా తన హయాంలోనే గాక, గతంలో ఈ విధంగా రచ్చ చేయడం విశాఖ ప్రజలు చూడలేదు. ఇంతటి దౌర్జన్యానికి చంద్రబాబు సర్కార్ ఒడిగట్టింది. అధికార కార్పొరేటర్లు సభా గౌరవాన్ని అగౌరవపరిచారు. పోలీసులను మేయర్ పోడియం వద్దకు పంపడం ఇదే తొలిసారి.
– గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్
భయానక వాతావరణం సృష్టించారు..
జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కౌన్సిల్ సమావేశంలో భయానక వాతావరణం సృష్టించారు. సభా మర్యాదలు మంటగలిపారు. దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అక్రమాలకు అడ్డాగా నిలిచారు. అడిగిన వారిపై విరుచుకుపడ్టారు. ఇదేనా కౌన్సిల్ నిర్వహించే తీరు. సీసీ కెమెరాలు కూడా ఆపేశారు. మీడియాను కూడా అనుమతించలేదు.
– కట్టుమూరి సతీష్, డిప్యూటీ మేయర్, జీవీఎంసీ
మేయర్ నాపై దౌర్జన్యానికి దిగారు..
హుందాగా వ్యవహరించాల్సిన మేయర్ స్థాయిని మరచి దిగజారి మరీ నాపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ప్రజాస్వామ్యంలో అక్రమాలకు ఎవరైనా పాల్పడితే నిలదీయడం తప్పా? సభ్యుల ముందు తనను అగౌరవ పరిచారు. ఒక విధంగా చెప్పాలంటే గూండాగిరి ప్రదర్శించినట్టే.
– బాణాల శ్రీనివాసరావు, ఫ్లోర్ లీడర్, వైఎస్సార్ సీపీ, జీవీఎంసీ
కిందకు తోసేశారు..
అక్రమాలకు అడ్డాగా నిలిచిన కూటమి మేయర్ పోడియం వద్ద ఆందోళనకు దిగితే దౌర్జన్యంగా తనపై కూటమి కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. నన్ను కిందకు తోసేశారు. మోచేతి నుంచి రక్తం కారుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.
– అల్లు శంకరరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వైఎస్సార్ సీపీ, జీవీఎంసీ
గాంధీ వర్ధంతి రోజునే ఇలా..
గాంధీ మహాత్ముని పేరు పెట్టుకుని (గాంధీ విశ్వవిద్యాలయం), ఆయన వర్ధంతి రోజునే విశాఖ ఎంపీ శ్రీభరత్ ఇలా పాల్పడడం దారుణం. సభలో అడ్డగోలుగా రౌడీయిజం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇదే నిదర్శనం. తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
– రెయ్యి వెంకటరమణ, కార్పొరేటర్, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
మరీ ఇంత దౌర్జన్యమా?
కౌన్సిల్ హాల్లో కూటమి కార్పొరేటర్లు వ్యవహరించిన తీరు గర్హనీయం. గత నాలుగేళ్లలో తానెప్పుడూ ఇలాంటి కౌన్సిల్ సమావేశాన్ని చూడలేదు. అధికార మదంతో కూటమి కార్పొరేటర్లు రెచ్చిపోయారు. మహిళ అని చూడకుండా తోసుకుంటూ వచ్చారు.
– కోరుకొండ స్వాతిదాస్, కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ
దారుణంగా వ్యవహరించారు..
అన్యాయం జరుగుతుంటే నిలదీయడమే తప్పా. పోడియం వద్ద నిరసన తెలిపితే మరీ దారుణంగా వ్యవహరించారు. కూటమి కార్పొరేటర్ల దౌర్జన్యానికి నా కాలుకి తీవ్రంగా దెబ్బ తగిలింది.
– బళ్ల లక్ష్మణరావు, కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ
సభా సంప్రదాయాలు మంటగలిసిన రోజు
సభా సంప్రదాయాలు మంటగలిసిన రోజు
సభా సంప్రదాయాలు మంటగలిసిన రోజు
సభా సంప్రదాయాలు మంటగలిసిన రోజు
సభా సంప్రదాయాలు మంటగలిసిన రోజు
సభా సంప్రదాయాలు మంటగలిసిన రోజు


