అంజనికుమార్‌కు ఆత్మీయ వీడ్కోలు
ఆరిలోవ: ఆంధ్రప్రదేశ్ జైళ్లు , సంస్కరణల సేవల శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఉన్నతాధికారులు ఆయనను ఘనంగా సత్కరించారు. జైళ్ల శాఖలో ఆయన ప్రవేశపెట్టిన వినూత్న సంస్కరణలు, ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, ఆయన అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఐ. శ్రీనివాస రావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఎం.ఆర్. రవి కిరణ్, ఎం. వర ప్రసాద్‌తో పాటు ఇతర విభాగాల సిబ్బంది పాల్గొని అంజనీ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


