అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌పై అధికారుల ఉక్కుపాదం
బీచ్‌రోడ్డు: నగరంలోని పూర్ణ మార్కెట్ ప్రాంతంలో నాణ్యత లేని, అనధికారిక గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న మూడు దుకాణాలపై జిల్లా సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేశారు. ఎటువంటి లైసెన్సులు లేకుండా, డెలివరీ బాయ్స్ నుంచి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సేకరించి, వాటిలోని ఎల్‌పీజీని ప్రమాదకర రీతిలో రెగ్యులేటర్లు, పైపుల సహాయంతో నాణ్యత లేని స్థానిక చిన్న సిలిండర్లలోకి నింపి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న లవ్లీ గ్యాస్ స్టవ్ రిపేర్స్, వైజాగ్ ట్రెండ్స్ మెన్స్ వేర్ క్లాత్ స్టోర్స్, ఇక్బాల్ ఫ్యాన్సీ స్టోర్స్‌లలో తనిఖీలు చేపట్టి భారీగా గ్యాస్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో భాగంగా 11 డొమెస్టిక్ సిలిండర్లు, 98 నాణ్యత లేని లోకల్ గ్యాస్ సిలిండర్లు, అలాగే బీపీసీఎల్ , హెచ్‌పీసీఎల్ సంస్థలకు చెందిన 5 కేజీల నాన్–డొమెస్టిక్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, అత్యంత ప్రమాదకరంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న సదరు యజమానులపై నిత్యావసర వస్తువుల చట్టం 1955, సెక్షన్ 6–ఏ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
బిమ్స్‌టెక్ దేశాల మధ్య పరస్పర అవగాహన


