సభను గౌరవించండి.. భూకబ్జాలకు వత్తాసుగా మార్చకండి
కౌన్సిల్ అజెండాలో పొందుపరిచిన 15 అంశాన్ని తొలగించండి
మేయర్, జీవీఎంసీ అదనపు కమిషనర్లకు వైఎస్సార్ సీపీ నేతలు వినతి పత్రం అందజేత
డాబాగార్డెన్స్: భూకబ్జాలకు వత్తాసుగా జీవీఎంసీ కౌన్సిల్‌ను మార్చొద్దని.. సభను గౌరవించి గీతం భూకబ్జా అంశాన్ని ఈ నెల 30న నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశ అజెండా నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు బుధవారం మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్లు ఎస్‌ఎస్ వర్మ, డీవీ రమణమూర్తి, నల్లనయ్య, పీఎం సత్యవేణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీతం విశ్వవిద్యాలయానికి ఎండాడ, రుషికొండ గ్రామాల్లోని 54.79 ఎకరాల ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 30న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 15వ అంశంగా చేర్చారని.. ఆ భూములు గీతం ద్వారా అక్రమంగా ఆక్రమించబడ్డాయని, కాబట్టి ఆ భూములు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే వరకు అజెండాలో చేర్చొద్దంటూ వినతిలో పేర్కొన్నారు. అక్రమ ఆక్రమణకు వ్యతిరేకంగా తగిన చట్టపర చర్యలు తీసుకోవాలని, భూములు తిరిగి పొందాలన్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి జీవో 571 ఉల్లంఘిస్తోందని, కాబట్టి అజెండా అంశంగా ఉంచకూడదని కోరారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమిని ఎంపీ శ్రీభరత్ కుటుంబానికి చాలా తక్కువ ధరకు విక్రయించడం బీఎస్‌ఓ–15, భూ కేటాయింపు విధానం వంటివి రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తుందని, ప్రజా ప్రయోజనం కంటే వ్యక్తిగత ప్రయోజనం కోసం జరుగుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉమ్మడి స్వాతిదాస్, పల్లా దుర్గా, కార్పొరేటర్లు అల్లు శంకరరావు, దౌలపల్లి ఏడుకొండలరావు, అక్కరమాణి రోహిణి, కటారి అనిల్‌కుమార్, మొల్లి లక్ష్మి, నక్కెల లక్ష్మి, పీవీ సురేష్, సాడి పద్మారెడ్డి, గుండాపు నాగేశ్వరరావు, తోట పద్మావతి, కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, వావిలపల్లి ప్రసాద్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, బర్కత్ ఆలీ, కేవీఎన్ శశికళ, బల్లా లక్ష్మణ్, మహ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయి అనూష లతీష్, ఉరుకూటి రామచంద్రరావు, కో ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, ఎండీ షరీఫ్, వార్డు అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్, భూపతిరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సభను గౌరవించండి.. భూకబ్జాలకు వత్తాసుగా మార్చకండి


