అదానీ గంగవరం పోర్టుకు సేఫ్టీ ఎక్స్‌లెన్స్ అవార్డు
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టుకు సేఫ్టీ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఎన్విరో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవాలో నిర్వహించిన 2వ వార్షిక గ్రీన్ ఎన్విరో సమ్మిట్, ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అదానీ గంగవరం పోర్టుకు ఈ అవార్డు లభించింది. పోర్టు యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ సముద్రయాన రంగంలో విశేష సేవలందిస్తున్నందుకు ఈ అవార్డు లభించిందన్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్ర భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు.


