అప్పన్న సేవలో రైల్వే పార్లమెంటరీ కమిటీ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని ఆదివారం రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. ఈ బృందంలో ఎంపీలు భరత్‌భాయ్ మనుభాయ్ సుతారియా, డాక్టర్ కె.లక్ష్మణ్, నరహరి అమీన్, ఖాజిన్ ముర్మ, భలభద్ర మజ్హి, దామోదర్ అగర్వాల్, సుభాశిష్ కుంటియా, కౌశలేంద్రకుమార్, సుదామ ప్రసాద్, ఉమ్మెదరామ్ బెనివాల్ తదితరులు ఉన్నారు. ముందుగా వీరంతా ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలో అర్చకులు వీరి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం అందించారు. దర్శనానంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం కమిటీ సభ్యులకు స్వామి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రాలను దేవస్థానం ఇన్‌చార్జి ఈవో సుజాత అందజేశారు.


