
7న ఉదయం 11.30 వరకే అప్పన్న దర్శనాలు
సింహాచలం: ఈ నెల 7న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 11.30 గంటల వరకు మాత్రమే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు లభిస్తాయని సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. తిరిగి 8న ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. 7న మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. 7, 8 తేదీల్లో స్వామికి జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. సుప్రభాత సేవ, ఆరాధన టిక్కెట్లు కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులంతా ఈ విషయాలను గమనించాలని కోరారు.