ఆరిలోవ: ఓ మహిళ ఆత్మహత్య కేసులో రిమాండ్‌లో ఉన్న యూఎస్ సిటిజన్ పిల్లా శ్రీధర్‌ను ములాఖత్‌లో భాగంగా యూఎస్ ఎంబసీ ప్రతినిధులు గురు వారం కేంద్ర కారాగారంలో కలిశారు. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, బెయిల్, ఇతర సహాయంపై చర్చించినట్లు జైలు అధికారులు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. యూఎస్ పౌరసత్వం కలిగిన విశాఖ వాసి పిల్లా శ్రీధర్‌కు నగరంలో ఇటీవల జరిగిన ఓ మహిళ ఆత్మహత్య కేసులో కోర్టు రిమాండ్ విధించింది. విదేశీ పౌరసత్వం ఉండటంతో నిబంధనల మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్) ఎన్.సాయిప్రవీణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనతో ములాఖత్‌కు యూఎస్ ఎంబసీ నుంచి అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ స్పెషలిస్ట్ శ్రీదేవి పోలి, వైస్ కౌన్సిల్ క్రిస్టీ చార్లెస్ వచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీయులు ఎవరు జైల్‌కు రిమాండ్‌కు వచ్చినా ఆ దేశ మంత్రిత్వ శాఖకు సమా చారం ఇవ్వాలన్నారు. ఇటీవల శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు యూఎస్ సిటిజన్లు బెయిల్‌పై విడుదలైనట్లు పేర్కొ న్నారు. వీరిద్దరు ఓ స్థల వివాదంపై రిమాండ్‌కు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర కారాగారంలో తొమ్మిదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నైజీరియాకు చెందిన ఓ ముద్దాయితో పా టు, సైబర్ నేరంలో అరెస్టయిన తైవాన్‌కు చెందిన ఇద్దరు ఖైదీలు ఉన్నట్లు డీఎస్ సాయి ప్రవీణ్ తెలిపారు. వీళ్లు వారి దేశంలో తమ కుటుంబ సభ్యులతో ఇ–ములాఖత్‌లో భాగంగా వీడియోకాల్ ద్వారా మాట్లాడుతుంటారని వెల్లడించారు.