
● కళ్లెం వేయకపోతే.. కడుపు కోతే..
నగరంలో మైనర్లు ద్విచక్ర వాహనాలపై రెచ్చిపోతున్నారు. లైసెన్స్ లేకుండానే బైక్‌లు నడుపుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా హెల్మెట్లు ధరించకుండా, ట్రిపుల్, జిగ్‌జాగ్ డ్రైవింగ్‌తో ఇతర వాహనచోదకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. వారికి సరైన డ్రైవింగ్ నైపుణ్యాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండదు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వంటివి కూడా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వారి ప్రాణాలకే కాకుండా.. ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి మైనర్లకు బైక్‌లు ఇవ్వకుండా చూడాలి. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం