No Headline
2024లో విజయం సాధించిన తర్వాత.. ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తా.. అనంతరం విశాఖ నగరం నుంచే పరిపాలన సాగిస్తా..’
ఇటీవల విజన్ విశాఖ సదస్సులో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివీ..
విశాఖపట్నంను విశ్వనగరిగా మార్చాలన్న సీఎం వైఎస్ జగన్‌సంకల్పం.. సిద్ధించే దిశగా ఐదేళ్లలో నగరం రూపురేఖలు మారాయి. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన విశాఖకు ఈ ప్రభుత్వ హయాంలోనే అంతర్జాతీయ గుర్తింపుదక్కింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడు సార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించినా.. రాని ఇమేజ్.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుతో ఖండాంతరాలు దాటింది. ఈ సదస్సు ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు రూ.లక్షన్నర కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగర అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ప్రతి కోణంలోనూ అభివృద్ధి కెరటాలు ఎగిసిపడి.. సరికొత్తగా సాగరనగరి పలకరిస్తోంది. ఐదేళ్లలో మహా నగరిలో వచ్చిన మార్పులు నీతిఆయోగ్‌ను కూడా మెప్పించాయి. అందుకే గ్రోత్ హబ్ సిటీగా విశాఖను ఎంపిక చేసింది.
– సాక్షి, విశాఖపట్నం


