
బీచ్ రోడ్డులో దీపావళి వెలుగులు
మహారాణిపేట: చిన్నా,పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆహ్లాదపరుస్తూ వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. వారం రోజుల ముందు నుంచే దీపావళి వేడుక సందడిగా ప్రారంభమవగా, ఆదివారంతో ఈ ఉత్సవాల శోభ పతాక స్థాయికి చేరింది. ప్రతీచోట వ్యాపార, వాణిజ్య సముదాయాలు, వివిధ దుకాణాలు మొదలుకుని అన్ని ప్రధాన కూడళ్లు విద్యుద్దీపాల వెలుగులు, పచ్చని తోరణాలు, అందంగా అలంకరించిన పూలతో ముస్తాబై కనిపించాయి. ప్రతి ఇంటి ఆవరణ కూడా దీపపు కాంతులతో దేదీప్యమానంగా వెలుగులు వెదజల్లింది. రాత్రి బాణసంచా వెలుగుల్లో నగరం జిగేల్‌మంది. నగరంలో ప్రముఖులంతా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ మల్లికార్జున దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఆకాశదీపం
వెలిగిస్తూ...
కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చుతున్న కలెక్టర్ మల్లికార్జున

దీపావళి వేడుకల్లో మహిళలు

