అపురూప వేడుక | - | Sakshi
Sakshi News home page

అపురూప వేడుక

Feb 23 2026 6:50 AM | Updated on Feb 23 2026 6:50 AM

అపురూ

అపురూప వేడుక

డాబాగార్డెన్స్‌: నగరంలోని ఒక హోటల్‌లో ఆదివారం ‘ట్విన్స్‌ డే’ వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 50 మంది కవలలు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. నిర్వాహకులు రామరాజు, లక్ష్మణ్‌రాజు, వైజాగ్‌కు చెందిన రామ్‌, లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో కవలలందరూ కలిసి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకే రూపంతో ఉన్న ఇంతమంది కవలలను ఒకే వేదికపై చూడటం సంతోషంగా ఉందని, వీరందరూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. మరోవైపు, మహారాణిపేట దిబ్బలపాలెంకు చెందిన కవలలు నిరుపమ, నిరూప్‌ తమ పుట్టినరోజును పురస్కరించుకుని స్వామి వివేకానంద సంస్థలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ ఉదారతను చాటుకున్నారు.

నిరుపమా..నిరూప్‌

అపురూప వేడుక1
1/1

అపురూప వేడుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement