నేడు ‘డయల్‌ యువర్‌ ఈపీడీసీఎల్‌ సీఎండీ’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘డయల్‌ యువర్‌ ఈపీడీసీఎల్‌ సీఎండీ’

Feb 23 2026 6:50 AM | Updated on Feb 23 2026 6:50 AM

నేడు ‘డయల్‌ యువర్‌ ఈపీడీసీఎల్‌ సీఎండీ’

నేడు ‘డయల్‌ యువర్‌ ఈపీడీసీఎల్‌ సీఎండీ’

సాక్షి, విశాఖపట్నం : డిస్కమ్‌ పరిధిలోని విద్యుత్‌ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో నేడు ‘డయల్‌ యువర్‌ ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్‌ ఇమ్మడి ప్రకటించారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమానికి సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్‌ పాడేరు, రాజమహేంద్రవరం, కాకినాడ, డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారులు 8688400499 ఫోన్‌ నంబర్‌ ద్వారా విద్యుత్‌ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్‌న్స్‌ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్‌ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సీఎండి పృథ్వీతేజ్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement