పుస్తకమే అమృత హస్తం | - | Sakshi
Sakshi News home page

పుస్తకమే అమృత హస్తం

Feb 23 2026 6:50 AM | Updated on Feb 23 2026 6:50 AM

పుస్తకమే అమృత హస్తం

పుస్తకమే అమృత హస్తం

డాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టారు.. నైటవుట్లు, కంబైన్డ్‌ స్టడీస్‌, మాక్‌ టెస్టులు, ప్రీ ఫైనల్స్‌ అంటూ ఎంతో కష్టపడి చదివారు. ఇప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లూ మీరు చదివిన పుస్తకాలే ఇప్పుడు మీకు అమృత హస్తాలు. వాటితో స్నేహం చేస్తే ఒత్తిడి మాయమవుతుంది. అనవసరమైన ఆందోళనను పక్కనపెట్టి, ప్రశాంతతను అలవర్చుకుంటే విజయం మీ సొంతం అవుతుందని విద్యావేత్తలు విద్యార్థులకు భరోసా ఇస్తున్నారు.

ఇలా చేసి చూడండి

సిలబస్‌ మొత్తం పూర్తయిన తర్వాత అనవసరంగా టెన్షన్‌ పడితే, ఆ ఒత్తిడి పరీక్షలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి సమయాన్ని సబ్జెక్టులు, టాపిక్‌ ప్రాధాన్యతను బట్టి తెలివిగా విభజించుకోండి. గంటల తరబడి ఏకధాటిగా పుస్తకాల ముందు కూర్చోవద్దు. మధ్యమధ్యలో చిన్నపాటి బ్రేక్స్‌ తీసుకోవడం వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. రివిజన్‌ చేసేటప్పుడు ముఖ్యమైన పాయింట్లతో షార్ట్‌ నోట్స్‌ రాసుకోండి. పరీక్షలకు ముందు రోజుల్లో ఇది ఎంతో మేలు చేస్తుంది. తోటి మిత్రులతో కలిసి అప్పుడప్పుడు కష్టమైన సబ్జెక్టులపై చర్చించుకోవడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, సందేహాలు నివృత్తి అవుతాయి. పరీక్షలు పూర్తయ్యే వరకు స్మార్ట్‌ ఫోన్లకు, సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండండి.

ఆరోగ్యమే అసలైన బలం

పరీక్షల సమయంలో కేవలం చదువుపైనే కాకుండా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ప్రొటీన్లు అధికంగా ఉండే, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 6 నుంచి 7 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి. సరైన నిద్ర ఉంటేనే చదివింది మెదడులో నిక్షిప్తం అవుతుంది. ఉదయం కాసేపు ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, పాజిటివ్‌ మైండ్‌ సెట్‌ అలవడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement