అబ్బురపర్చిన స్టాళ్లు | - | Sakshi
Sakshi News home page

అబ్బురపర్చిన స్టాళ్లు

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల శాఖల ప్రదర్శనలు ఆర్గానిక్‌ సాగు

వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల శాఖల ప్రదర్శనలు

బొంరాస్‌పేట: దుద్యాల మండల హకీంపేట హబ్‌ సమీపంలో శనివారం నిర్వహించిన మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనలు అన్నదాతలను అబ్బుర పర్చాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమలో వచ్చిన ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ తదితర అంశాలు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. స్టాళ్లలో పాల్గొన్న సంబంధిత శాఖల శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు వివరించారు. సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వీటిని పరిశీలించారు.

వావ్‌.. ఆయిల్‌ పామ్‌

మేళాలో ప్రధానంగా ఆయిల్‌పామ్‌ స్టాళ్లు రైతులను ఆకట్టుకున్నాయి. ఆయిల్‌పామ్‌ గెలలను చూసిన రైతులు సాగు విధానం, సబ్సిడీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట లాభదాయకంగా ఉంటుందని, ప్రభుత్వం నుంచి రాయితీలు ఉంటాయని అధికారులు వివరించారు.

పురుగులతో పట్టు పరిశ్రమ

పురుగులు అనగానే చీడపీడలు కావని పట్టు పరిశ్రమలు నెలకొల్పి కాటన్‌తో పట్టు వస్త్రాలను తయారే చేసేందుకు ముడిసరుకు అందించవచ్చని కాటన్‌ గురించి రైతులకు వివరించారు. పట్టుపురుగుల పెంపకం, ఉసిరికాయలు, కాటన్‌ దారం తయారీ, వస్త్రాలు, దుస్తుల వ్యాపారం వంటి అంశాలను రైతులు తెలుసుకున్నారు. వృథా ఉన్న ఉరిసికాయలతో అలంకరణలు చూపించారు.

రసాయనాలకు దూరంగా ఉంటూ సేంద్రియ ఎరువులతో పంటల సాగు ప్రాముఖ్యతను తెలియజేసేందుకు టీజీ ఆర్గానిక్‌ స్టాల్‌ ఏర్పాటు చేశారు. సాంప్రదాయ పద్ధతులేకాకుండా ఆధునిక సేంద్రియ విధానాలు అలలంబించాలని డీప్యూటీ డైరెక్టర్‌ రోహిణి వివరించారు. ఆరోగ్యకరమైన దిగుబడులను అందించడానికి రైతులు ఆర్గానిక్‌ ఎరువులతో పంటలు పండించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement