తాండూరు టౌన్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో ఆదివారం అండర్– 16 బాలుర జిల్లా స్థాయి క్రికెట్ సెలెక్షన్స్ నిర్వహించనున్నట్లు కోచ్‌లు జగన్నాథ్ రెడ్డి, సతీష్ శనివారం ఓ ప్రకటనలో కోరారు. తాండూరులోని సహారా క్రికెట్ అకాడమీలో ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంపిక కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. మే 2010 నుంచి మే 2013 మధ్య జన్మించిన క్రీడాకారులు అర్హులని, వైట్ జెర్సీ, కిట్, ఒరిజినల్ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని సూచించారు. ప్రతిభ కనబర్చిన వారిని నవంబర్ 11 నుంచి అజీజ్‌నగర్‌లో జరుగనున్న రాష్ట్ర స్థాయి టోర్నీలో ఆడిస్తామని టీసీఏ జిల్లా సెక్రటరీ శరత్‌సింగ్ తెలిపారు. వివరాలకు 9177357907, 9177847227 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
ధారూరు: మెథడిస్టు క్రిస్టియన్ జాతరకు వ్యాపారుల రాక ప్రారంభమైంది. ఈనెల 10నుంచి జాతర మొదలు కానున్న నేపథ్యంలో వ్యాపారులు ముందుగానే చేరుకుని తమకు అనుకూలమైన స్థలాల్లో టెంట్లు, గుడారాలు వేసుకుని షాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. జాతర ప్రాంగణంలో రంగుల రాట్నం, పిల్లలు ఆడుకునే ఆట సామగ్రిని సిద్ధం చేస్తున్నారు.


