దౌల్తాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామానికి చెందిన చిత్రకారుడు అశోక్ ప్రత్యేక కానుక తయారు చేశారు. సీఎంపై తనకున్న అభిమానంతో కొడంగల్ ప్రాంత అభివృద్ధిపై ఉన్న ఆకాంక్షను కలగలిపి వినూత్న కార్టున్ చిత్రాన్ని రూపొందించారు. రైతు మెగా మేళా, ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనుల శంకుస్థాపన వంటి అంశాలను తన చిత్రంలో అందంగా ప్రతిబింబించారు. తన చిత్రాలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు.


