అధ్వానపు రోడ్లు.. డొక్కు బస్సులు | - | Sakshi
Sakshi News home page

అధ్వానపు రోడ్లు.. డొక్కు బస్సులు

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

మర్పల్లి: మండలంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్లు కంకర తేలి అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు కండీషన్‌లో లేని బస్సులను నడుపుతుండటంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది అవస్థలు పడుతున్నారు. దెబ్బతిన్న రోడ్ల కారణంగా తరచూ వాహనాలు పాడవుతున్నాయి. పలు రూట్లలో వాహనాలు నడపాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని హడలిపోతున్నారు. గురువారం మండల కేంద్రంలోని కల్‌ఖోడ ఆర్‌అండ్‌బీ రోడ్డులో తాండూరు డిపోకు చెందిన బస్సు మర్పల్లికి వస్తున్న క్రమంలో టైర్‌ పంక్చర్‌ అయ్యింది. ప్రయాణికులు రెండు గంటల పాటు బస్సు వద్దే నిరీక్షించారు. మరమ్మతుల అనంతరం బస్సు ఇంజన్‌ ఆన్‌ కాలేదు. చేసేది లేక ప్రయాణికులు కిందకు దిగి బస్సును నెట్టడంతో స్టార్ట్‌ అయ్యింది. కంకర తేలిన రోడ్ల కారణంగా తరచూ వాహనాలు పాడవుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత శాఖల అధికారులు, పాలకులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని పలువురు డిమాండ్‌ చేశారు.

తరచూ మరమ్మతులకు గురవుతున్న వాహనాలు

ఇబ్బందుల్లో ప్రయాణికులు

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement