ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు | - | Sakshi
Sakshi News home page

ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు

Jul 1 2026 5:14 AM | Updated on Jul 1 2026 5:14 AM

అనంతగిరి: ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్‌ వడ్ల నందు అన్నారు. ఈ మేరకు మంగళవారం వికారాబాద్‌లో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కేంద్రం వాటాతో ఉన్న అభివృద్ధి పనులే కొనసాగుతున్నాయన్నారు. ఎంపీ కోట్పల్లి చెరువులో బోటింగ్‌ ఏర్పాటుతో నిరుద్యోగ యువకులకు, స్థానిక గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతోపాటు తన సొంత నిధులను జోడించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మున్సిపల్‌లో కేంద్ర పథకం అమృత్‌ 2.0 కార్యక్రమంతో మంచినీటి సరఫరా పనులు చేస్తున్నారన్నారు. ఎంపీ ప్రొటోకాల్‌ను సక్రమంగా పాటించాలన్నారు. సర్పంచ్‌పై దాడి చేసి కూడా కేసు పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శివరాజు, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, నేతలు రాజునాయక్‌, రాజు, రాజేందర్‌రెడ్డి, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement